● పోలింగ్ బూత్ ఏజెంట్ల శిక్షణలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
దేవనకొండ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ బెదిరింపులకు పాల్పడుతుందని, తాను ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, కార్యకర్తలకు అండగా ముందుంటానని, ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. మండల కేంద్రమైన దేవనకొండలోని మూగితాత దర్గా ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకుల కుటుంబాల్లో ఎవరికై నా ఓటు హక్కు లేకపోతే ఫారం–6 ద్వారా చేర్చాలన్నారు. టీడీపీ కార్యకర్తలు రెండు, మూడు చోట్ల ఓటుహక్కు కల్పించుకుని ఉంటే వారిని ఫారం–7 ద్వారా తొలగించాలని, అలాగే ఒక బూత్ స్థాయి ఓటరు మరొక బూత్‌స్థాయిలో చేరి ఉంటే వారిని ఫారం–8 ద్వారా మార్చాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు ముగుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చని సందర్భంగా ఈనెల 12న ఆలూరులో నిర్వహించే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో కూటమి అరాచకాలను, అడ్డుగోలు దోపిడీని ప్రజలకు వివరిద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, మండల కన్వీనర్ రామకృష్ణ, కో కన్వీనర్ ఆనంద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ అబ్జర్వర్ ప్రేమనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్‌సెల్ సె క్రటరీ కబీర్‌దాస్, ఆలూరు అసెంబ్లీ బూత్ కన్వీనర్ సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.


