ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని టీడీపీ ప్రభుత్వం క్రమంగా అటకెక్కిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ సాఫీగా సాగింది. చంద్రబాబు సర్కారు తాము కూడా ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని ప్రకటించినా, ప్రతినెలా సచివాలయాల వద్దకే వెళ్లి లబ్ధిదారులు పింఛను తీసుకున్న దృశ్యాలు కోకొల్లలు. సోమవారం చేపట్టిన పింఛన్ల పంపిణీకి చాలాచోట్ల సర్వర్ సమస్య తలెత్తింది. ఇదే సమయంలో అధికారులు కార్యాలయం వదలి రాకపోవడంతో లబ్ధిదారులు అక్కడికే వెళ్లి పింఛను తీసుకోవడం గమనార్హం. – చిప్పగిరి


