కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

కఠినంగా శిక్షించాలి

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

బొమ్మలసత్రం: పట్టపగలే నంద్యాల నడిబొడ్డులో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంపై జనసేన కార్యకర్త దాడి చేయడంతో వెఎస్సార్‌సీసీ నాయకులు, అభిమానులు ద్రిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ పీపీనాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీపీ మధుసూదన్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, సీఈసీ మెంబర్లు కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్‌ అమీర్‌, సీనియర్‌ నాయకులు డాక్టర రాకేష్‌రెడ్డి, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నంద్యాల శ్రీనివాససెంటర్‌లో ధర్నా చేశారు. అనంతరం ర్యాలీతో వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. దివంగతనేత విగ్రహంపై దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు సూత్రధారులను పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement