వెంటనే విడుదల చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

వెంటనే విడుదల చేయాలని వినతి

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ ఆధారిత బీమా కింద 2024 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కేంద్రం వాటా బీమా పరిహారం కొద్ది రోజులుగా విడుదలవుతోంది. ఈ మేరకు రైతులకు మెసేజ్‌లు వస్తున్నాయి. వాతావరణ బీమా కింద కేంద్రం వాటా 25 శాతం మొత్తం ప్రధానమంత్రి విడుదల చేస్తున్నారు. మిగిలిన 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు రైతులకు మెసేజ్‌లు వస్తున్నాయి. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రం వాటా వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ఖమర్‌ నిర్వహించారు. పంటల బీమాకు కేంద్రం వాటా పరిహారం విడుదల చేసిందని, రాష్ట్రం వాటా కూడా విడుదల చేయలని రైతులు వినతి పత్రం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement