భక్తులకు మెరుగైన సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ కె. రామచంద్రమోహన్‌ సూచించారు. ఆలయంలో రూ.15 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపడంతో వాటిని పరిశీలించేందుకు ఆదివారం ఆయన కుటుంబసమేతంగా వచ్చారు. రూ.4.20కోట్లతో మాడవీధులు, రూ.4.50 కోట్లతో అన్వేటి మంఠపం, రూ. 2.30కోట్లతో నూతన అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారని, వాటిపై డిప్యూటీ కమిషనర్‌ వాణితో చర్చించారు. బస్టాండ్‌ను పరిశీలించి, దానిని డార్మెంటరీగా తయారు చేసి భక్తులకు ఉపయోగంలోకి తీసుకుని రావాలని సూచించారు. దేవాలయం వద్ద మొత్తం 42 పనులకు టెండర్లు పిలువగా ఇప్పటికే కొన్ని పూర్తవగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని డిప్యూటీ కమిషనర్‌ వాణి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement