కర్నూలు కల్చరల్: నగరంలోని ఓల్డ్‌సిటీలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జమ్మిచెట్టు మళ్లీ జీవం పోసుకుంది. ఈ చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే దసరా పండుగా రోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి వృక్షం ఇటీవల పూర్తిగా ఎండి పోయి చెదలు పట్టింది. పలువురు దీనిని తొలగించి కొత్తది నాటాలనుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికుడు అంబిలి చంద్రమౌళి ఎండిన వృక్షాన్ని పరిశీలించి ఎలాగైన సంరక్షించాలని తలంచారు. 30 రోజుల పాటు శ్రమించి ప్రకృతి పద్ధతిలో చికిత్స చేసి కొత్త చిగురులు తెప్పించగలిగారు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్లు ఉంటే 95812 11888 నంబర్‌కు సమాచారం ఇస్తే సంరక్షించే బాధ్యత తీసుకుంటానని అంబిలి చంద్రమౌళి పేర్కొన్నారు.


