పేదల హృదయాల్లో కొలువైన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖ్ రెడ్డి విగ్రహంపై దాడిని నంద్యాల చిత్రకారుడు కోటేష్ ఖండించారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం పగులగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దాడి జరిగిన సంఘటనకు స్పందించి ఓ చిత్రాన్ని ఆవిష్కరించారు. చిత్రంలో ధ్వంసం చేసిన విగ్రహాన్ని చూసి ప్రజలు మదన పడుతున్నట్లు ఓ అభిమాని రాజన్నా.. మమ్మల్ని మన్నించు.. నీ రూపాన్ని నీ విగ్రహంలో చూసుకొనే వాళ్లం. మా హృదయాల్లో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉన్నావు.. దుండగులు విగ్రహం పడగొట్టిన చోటనే నూతన విగ్రహం తయారు చేసుకుంటామంటూ’ కన్నీరు పెడుతూ విలపిస్తున్నట్లు చిత్రాన్ని గీచారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో వైఎస్సార్ అభిమానులు వేదన పడుతున్నట్లు చూపారు.
– నంద్యాల(అర్బన్)


