బనగానపల్లె రూరల్: మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన సత్యనారాయణ,లక్ష్మీదేవి దంపతుల కుమారుడు బోయ రమేష్(25) కడుపు నొప్పి తాళలేక రసాయన పౌడర్‌ను నీటిలో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఈ యువకుడు పలు వైద్యులు వద్ద చూపించుకున్నా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే బోయ రమేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య నందిని ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు.


