రాయలసీమ సాహిత్యం చాలా గొప్పది | - | Sakshi
Sakshi News home page

రాయలసీమ సాహిత్యం చాలా గొప్పది

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కుం.వీరభద్రప్ప

ఎమ్మిగనూరుటౌన్‌: రాయలసీమ సాహిత్యం చాలా గొప్పదని, మారుతి పౌరోహితం రచించిన ఇల్లిడిసిన తొమ్మిది కథలు పుస్తకం సీమ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉందని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కుం.వీరభద్రప్ప, రాయలసీమ ఉద్యమ నాయకులు, రచయిత భూమాన్‌ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వాసవీ కళ్యాణ మండపంలో కంభం పాటి సాయినాథ్‌ శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ , రచయిత తాడి ప్రకాష్‌, ప్రముఖ సాహితీ వేత్త ముక్కామల చక్రధర్‌, కవి వెంకటకృష్ణ, సాహితి స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగర మోహన్‌లు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ఉద్యమాలు అవసరమన్నారు. రాయలసీమ జీవితం కంటే సాహిత్యం గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో మారుతి పౌరోహితం అక్కబావలైన శ్రీనివాసమూర్తి, వెంకటలక్ష్మి, కవులు అనంత్‌, వెంకటేష్‌, కర్ణాటకకు చెందిన సాహితీవేత్తలు చిదానందసాలె, రచయిత ఇనాయతుల్లా, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రమాకాంతరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement