మహానాడు.. మహా నాటకం | - | Sakshi
Sakshi News home page

మహానాడు.. మహా నాటకం

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

కర్నూలు (టౌన్‌): తెలుగుదేశంపార్టీ రెండు రోజులు నిర్వహించిన రాష్ట్ర మహానాడు మహానాటకంగా సాగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారన్నారు. దీంతో చెప్పేందుకు ఏమిలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు జగనన్న కంటే రెండింతలు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి ఆచరణలో ఆ ఊసే లేదన్నారు. రెండేళ్లలో వైద్యం, వ్యవసాయ రంగాల నిర్వీర్యంపై, 6 లక్షల పెన్షన్ల రద్దుపై చర్చ ఏదీ అని ప్రశ్నించారు. 50 ఏళ్లకే పెన్షన్‌, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు భృతి వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ పేరుతో టీచర్‌ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. నారా లోకేష్‌ జపం చేయడానికి తప్పా మహానాడుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

చెప్పేందుకు ఏమి లేక

జగనన్నపై విమర్శలు

వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement