కోసిగి: మండల కేంద్రం కోసిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–2001 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆదివారం స్థానిక పాఠశాలలో అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపట్టారు. ఆనాటి విద్యా బోధన చేసిన గురువులు జ్యోతి, ఝాన్సీ, జయన్న, శ్రీనివాసులు, నాగరాజు శాసీ్త్ర, సంజన్న, పద్మనాభాచారి, రామ్మోహన్, వినోద్‌కుమార్, మహాబూబ్ బాషా, రతంగ పాండు రెడ్డి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలు, ప్రస్తుతం స్నేహితులందురూ ఎక్కడెక్కరు ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారో ఒకరికరు విషయ అనుభూతులను పంచుకున్నారు. తమతో పాటు చదువుకుని మృతి చెందిన స్నేహితులను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ఆర్థికంగా ఇబ్బంది ఉండే స్నేహితులకు తమవంతు సహాయ సమకారాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీరాములు, రైల్వే విజయ్, రామాంజినేయులు, చిప్పిగ బసవ, దుమతి శ్రీనివాసులు, రామకృష్ణ రెడ్డి, జ్ఞానేష్, నాగరాజు, సూర్యనారాయణ, నరసప్ప తదితరులు ఉన్నారు.


