కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందారు. వారికి కేటాయించిన కాలేజీల్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ కే నాగరాజు శెట్టి, కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ డీ నాగన్న అక్కడే ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందారు. కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డా.వెంకటరెడ్డికి పదోన్నతి కల్పిస్తూ రెగ్యులర్ చేశారు. అదే కాలేజీకి చెందిన ఉర్దూ విభాగం అధ్యాపకురాలు డాక్టర్ ఇర్ఫానా బేగం పదోన్నతి కల్పిస్తూ పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించారు. కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు డా.టి మాదన్నకు పదోన్నతి కల్పించి మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించారు. వీరందరూ బాధ్యతలు స్వీకరించంతో ఆయా కాలేజీలకు చెందిన అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


