మునగ బెండ్లు ఊడిపోయి.. | - | Sakshi
Sakshi News home page

మునగ బెండ్లు ఊడిపోయి..

May 30 2026 3:02 AM | Updated on May 30 2026 3:02 AM

● ఈత నేర్చుకుంటూ బాలిక మృతి

మద్దికెర: స్థానిక ఎడవలి రోడ్డులో బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పదేళ్ల బాలిక మృత్యువాత పడింది. అనంతపురం జిల్లా బెలుగుప్ప గ్రామానికి చెందిన గాయత్రి, తిమ్మారెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో పెద్ద కుమార్తె లక్ష్మీదేవి (10) మద్దికెరలోని మేనమామ కేశవరెడ్డి ఇంటికి వచ్చింది. శుక్రవారం ఈత నేర్చుకునేందుకు ఎడవలి రోడ్డులోని సుంకరోళ్ల బావి వద్దకు వెళ్లింది. మునగబెండ్లు కట్టుకుని బావిలోకి దూకిన సమయంలో బెండ్లు ఊడిపోవడంతో ఈతరాక మునిగిపోతుండడంతో గమనించి బయటికి తీశారు. కాగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందింది. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement