● పులగం, పచ్చడి వంటతో గుర్తింపు
బండిఆత్మకూరు: మిడ్డే మీల్స్ కుక్ కం హెల్పర్స్ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు ఎంపీపీఎస్ పాఠశాల కుక్ నాగ భూషణమ్మ ప్రథమ బహుమతి సాధించింది. మండల విద్యాశాఖ అధికారులు యశోద, మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. విజయవాడలో ఈనెల 28, 29 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి కుకింగ్ ట్రైనింగ్ కార్యక్రమంలో నాగ భూషణమ్మ పులగం, పచ్చడి చేసి మొదటి బహుమతి సాధించినట్లు తెలిపారు. ప్రథమ బహుమతి సాధించిన నాగభూషణమ్మతో పాటు మరొక వంట మనిషి ఈశ్వరమ్మను మండల విద్యాశాఖ అధికారులు అభినందించారు.


