కర్నూలు: కర్నూలు నుంచి దూపాడుకు వెళ్లే మార్గంలో కార్బైడ్ ఫ్యాక్టరీ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో శరీరమంతా నుజ్జునుజ్జు అయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారు 45 సంవత్సరాల వయసు ఉండి తెలుపు రంగు గీతల షర్టు, నీలం రంగు లోయర్, తెలుపు రంగు కట్ బనియన్, నలుపు రంగు కట్ డ్రాయర్ ధరించాడు. సుమారు 5.6 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ వర్ణం ఉంటాడు. ఎడమ మోచేతిపైన ఎంఎస్‌కే అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయి. ఆచూకీ తెలిసినవారు 9247575608, 9247575609 ఫోన్ చేసి సమాచారమివ్వాలని కర్నూలు రైల్వే పీఎస్ సీఐ శ్రీనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శతాధిక వృద్ధుడి మృతి
కొత్తపల్లి: మండల కేంద్రంలో ఓ శతాధిక వృద్ధుడు గురువారం రాత్రి మృతి చెందాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏళ్ల బాల సుబ్బారెడ్డి (108) గత కొద్దిరోజు లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. ఈయన 1918లో జన్మించి ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉ న్నాడని గ్రామస్తులు చెప్పారు. వృద్ధుడికి ము గ్గురు కుమారులు, ఒక కూతురు ఉండగా వా రిలో పెద్దకొడుకు,చిన్న కొడుకు చనిపోయారు.
కరీంనగర్ వాసి ఆత్మహత్య
కర్నూలు: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణానికి చెందిన కందనూరి వేణుసాగర్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం కర్నూలుకు వలస వచ్చి బళ్లారి చౌరస్తాలో ఉన్న డీ–మార్ట్ వెనుక గణేష్ నగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసమున్నాడు. అదే కాలనీలో నివాసమున్న మెకానిక్ కేశన్నతో కలసి ట్రాన్స్‌పోర్టు వాహనాల వ్యాపారం చేసేవారు. రాత్రి గదిలో చీరతో ఉరి వేసుకున్నాడు. శుక్రవా రం ఉదయం తలుపు తెరవకపోవడంతో ఇంటి ఓనర్లు గట్టిగా తలుపు తట్టినా పలకలేదు. దీంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరికి వేలాడు తూ మృతి చెందాడు. వెంటనే విషయం కరీం నగర్‌లో ఉన్న తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కర్నూలు చేరుకున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. నాలుగో పట్టణ పోలీసులు మృతుడి తండ్రి శ్రీనివాసులు తో సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఇద్దరికి పాము కాటు
శిరివెళ్ల: కోటపాడులో ఉపాధి పనుల వద్ద ఇద్ద రు పాము కాటుకు గురయ్యారు. శుక్రవారం ఉపాధి కూలీలు పంట కాల్వలో పూడిక తీస్తుండంగా మొదట ఉపాధి కూలీ హబీబ్‌బాషాను పాము కరిచింది. పక్కనే ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ షేక్ ఉస్సేనిబాషా కొడవలితో పామును కొడుతుండగా అతడిని కరిచింది. చికిత్స నిమిత్తం ఇద్దరిని 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఇన్‌చార్జ్ ఏపీఏ సల్లాఉద్దీన్ వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు.
బీఎల్‌ఓలకు షోకాజ్ నోటీసులు
కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థలో పనిచేసే 17 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లకు శుక్రవారం కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చల్లా ఓబులేసు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నగరంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సర్వేకు నియమించిన బీఎల్‌ఓలు విధి నిర్వహణలో స్పందించకపోవడంతో నోటీసులు జారీ చేశారు. 24 గంటల వ్యవధిలో లిఖిత పూర్వకంగా కారణాలు తెలియజేయాలన్నారు.


