పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు

May 30 2026 2:56 AM | Updated on May 30 2026 2:56 AM

కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి పి.కిశోర్‌రెడ్డి

కర్నూలు(సెంట్రల్‌): పర్యావరణ పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి పి.కిశోర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఇన్‌స్పైర్‌డ్‌ ది నేచర్‌ ఫర్‌ క్‌లైమెట్‌.. ఫర్‌ ఫీచర్‌’ అనే నినాదంతో పోటీ పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామన్నారురు. ఆన్‌లైన్‌ సైట్‌ కోసం స్కానర్‌ను స్కాన్‌ చేసి వివరాలు నమోదు చేసి టాపిక్‌ ఎంచుకొని పోటీ పరీక్షలో పాల్గొనాలని సూచించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్‌ అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూన్‌ 5లోపు పోటీల్లో పాల్గొనాలని, వివరాలకు వెంకటరమణ కాలనీలోని పీసీబీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement