చెరువుల్లో సాధారణంగా పొలుసు చేపలు, బురదమట్టలు, కొర్రమీను, పంజరం, తదితర చేపలు దొరుకుతూ ఉంటాయి. చేపల ప్రియులు వీటిని ఇష్టంగా తింటారు. బొల్లవరంలోని రామరాజు బావిలో మత్స్యకారుడు ప్రసాద్ చేపలు పడుతుండగా ఓ చేప విచిత్రంగా కనిపించింది. శాసీ్త్రయంగా సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్, హైపోస్టోమస్ ఫ్లెకోస్టోమస్‌గా పిలవబడే ఈ చేపను స్థానికంగా రాకాసి చేప, దెయ్యం చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. చేపకు శరీరం అంతా గరుకుగా, కవచం లాంటి పొలుసులు ఉన్నాయి. చెరువులోని పాచీ, జంతువుల కుళ్లిన కళేబరాలు తింటాయని చెబుతున్నారు. వీటికి ఉన్న పదునైన రెక్కలతో స్థానిక జాతి చేపలను గాయపరుస్తాయని, దీని ద్వారా చేపల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. – మహానంది


