మద్దికెర: మండల కేంద్రమైన మద్దికెరలో నేటికి రాచరిక సంప్రదాయం కొనసాగుతోంది. చిన్న మసీదు ముస్లింలు ప్రతి పండుగకు స్థానిక యాదవరాజులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ. అందులో భాగంగా గురువారం ముస్లింలు బక్రీదు పండగ సందర్భంగా యాదవరాజుల ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యాదవరాజు జమేదార్ జయరామరాజు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటికి వచ్చిన ముస్లింలకు తాంబూలం అందజేయడం పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తుందని, తాము కూడా ఆనవాయితీని ఆచరిస్తున్నామన్నారు.


