కొలిమిగుండ్ల: నందిపాడు సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. నంద్యాల పట్టణానికి చెందిన మహిళలు కొలిమిగుండ్ల మండలం కల్వటాలలోని బంధువుల వివాహానికి ఇన్నోవా కారులో హాజరయ్యారు. పెళ్లి తంతు ముగిశాక నంద్యాలకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నందిపాడు శివార్లలోని ప్రధాన రహదారిలో ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు చేరుకోగానే ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ గమనించకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే ఉన్న ఇన్నోవా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఇరుక్కుపోగా స్థానికుల సాయంతో బలవంతంగా బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న మహిళలు నాగలక్ష్మి, సరసమ్మ, అనూష, మల్లమ్మ, రాణి, చిన్నారి వేదాన్షితో పాటు మొత్తం పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహన సిబ్బంది కొలిమిగుండ్ల పీహెచ్‌సీకి తరలించారు.
బీజేవైఎం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
కర్నూలు కల్చరల్: భారతీయ జనతా యువమోర్చా జిల్లా నూతన కమిటీని రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జంపాల కేశవ్‌రామ్ చౌదరి ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కె.అఖిల్, బి.సూర్య, లోకేష్, బి.నాగరాజు, మోహన్, ప్రధాన కార్యదర్శులుగా జె.భరత్‌కుమార్, గోపి, కార్యదర్శులుగా పులిరాజు, సురేష్ నాయక్, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, శరత్, లీగల్‌సెల్ కన్వీనర్‌గా గణేష్, మెడికల్ సెల్ కన్వీనర్‌గా నవీన్, ఆర్‌టీఐ సెల్ కన్వీనర్‌గా రాజు, ఐటీ సెల్ కన్వీనర్‌గా స్వరూప్, స్పోర్ట్స్ సెల్ కన్వీనర్‌గా భరత్, సోషియల్ మీడియా సెల్ కన్వీనర్‌గా దామోదర్‌లను ప్రకటించారు.
3న సీనియర్ హాకీ
ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): స్థానిక ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానంలో వచ్చే నెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు సీనియర్ మెన్ హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యులు దాసరి సుధీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు 1992 సంవత్సరం తర్వాత పుట్టిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు. ఎంపికై న జిల్లా హాకీ జట్టు జూన్ 12 నుంచి 15 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించనున్న 16వ హాకీ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 9966565317 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. క్రీడా కారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు ఖ్యాతి తీసుకు రావాలన్నారు.


