కర్నూలు: కర్నూలు డీఎస్పీ జె.బాబుప్రసాద్‌కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఏపీలో 20 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా, 41 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలు గా పదోన్నతి కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌కు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వాటర్స్ మంగళగిరిలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన బాబుప్రసాద్ 1991లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. 2004లో సీఐగా, 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు జిల్లా గూడూరు, చిత్తూరు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు. 2024 ఫిబ్రవరిలో కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీగా బదిలీపై వచ్చి కొంతకాలం పనిచేశారు. 2024 ఆగస్టు 5న కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి 22 నెలల పాటు సేవలందించారు.


