ఐ టీడీపీ జిల్లా అధ్యక్షుడే నాతో చెప్పాడు
కర్నూలు(టౌన్): మంత్రి టీజీ భరత్‌కు, పెద్దాయన టీజీ వెంకటేష్ మధ్య విభేదాలు, గొడవలు ఉన్నట్లు ఐ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ తనతో చెప్పినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్ అన్నారు. బుధవారం స్థానిక అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్నారు. ఐ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, తనకు మధ్య జరిగిన సంభాషణలో కొంత భాగాన్ని వాయిస్ మార్చి ట్రోల్ చేస్తున్నారన్నారు. ఇటీవల మహానాడుకు మంత్రి టీజీ భరత్ డబ్బులు ఇవ్వలేదని.. గట్టు తిలక్ అడిగితే తానే పంపించానన్నారు. చాలాసార్లు ఇలా చేశానన్నారు. భరత్ తన మాట వినడం లేదని పెద్దాయన బాధ పడుతున్నట్లు కూడా తెలిపాడన్నారు. ఇలాంటి వాయిస్‌లు, వీడియోలు బయటపెడితే బాగుంటుందన్నారు. ఐ టీడీపీకి చెందిన జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో ఫోన్ చేసి క్షేమ సమాచారాలు మాత్రమే తెలుసుకున్నానన్నారు. అయితే ట్రోల్ చేస్తున్న మిగతా వాయిస్ తనది కాదన్నారు. గట్టు తిలక్, తనకు మధ్య జరిగిన సంభాషణపై పరువునష్టం కేసు వేసినా ఆ డబ్బులు కూడా తానే ఇవ్వాల్సి వస్తుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు చోటు, ముస్తఫా, అబ్దుల్ మాలిక్, షోయబ్, రెహమాన్ ఖాన్ పాల్గొన్నారు.
దమ్ముంటే ఈ వాయిస్
విడుదల చేయండి
నా వాయిస్ మార్చి ట్రోల్ చేస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నగర
అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్


