ఓటరు మ్యాపింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు మ్యాపింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

కర్నూలు(సెంట్రల్‌): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి ఓటరు మ్యాపింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని వన్‌టౌన్‌లోని మాసుంబాషా దర్గా, బుధవారపేటలో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా తప్పులు జరగకుండా మ్యాపింగ్‌ నిర్వహించాలన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు అనర్హులను జాబితాను తొలగించడమే లక్ష్యమన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఒకే పోలింగ్‌ బూత్‌లో మ్యాపింగ్‌ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ దామోదరం సంజీవయ్య స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలోని 142, 143, 144, 145, 146, 147 పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ వివరాలను తెలుసుకున్నారు. కర్నూలు నియోజకవర్గ ఎన్నికల అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేషు, ఏఈఆర్‌ఓ కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ డి.రవికుమార్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మురళీ, ఎన్నికల డెప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement