ముగిసిన పోలీసుల మెడిటేషన్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పోలీసుల మెడిటేషన్‌ శిక్షణ

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

కర్నూలు : జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి గత మూడు రోజులుగా హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడిటేషన్‌ శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా, ప్రాణాయామం, ధ్యానసాధన చేశారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ ట్రైనర్లు శ్వాసక్రియలు, ఏకాగ్రత పెంపొందించే సాధనాలు, మానసిక ఒత్తిడి తగ్గించే ధ్యాన విధానాలపై శిక్షణ ఇస్తూ అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పెరిగి విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్స్‌ సదరన్‌ రీజియన్‌ కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహ న్‌,హోంగార్డ్స్‌ డీఎస్పీ ప్రసాద్‌, సీఐలు,ఆర్‌ఐలు, ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

డీఐజీ కార్యాలయంలో...

కర్నూలు బి.క్యాంప్‌లోని కర్నూలు రేంజ్‌ డీఐజీ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణ, మానసిక ప్రశాంతత కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక మెడిటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement