మాది న్యూఢిల్లీ. భర్త ఉద్యోగ రీత్యా కర్నూలుకు వచ్చాం. ప్రతి రోజు కోలాటం సాధన చేస్తున్నాను. దేవుడి పాటలకు కోలాటంతో నృత్యం చేస్తుంటే సంతోషంగా ఉంది. ఈ ఆటలో మానసిక ప్రశాంతతతో పాటు మంచి వ్యాయామం లభిస్తుంది.
– ప్రాచీ, న్యూఢిల్లీ
ఉత్సవాల్లో కోలాటం వేసే భాగ్యాన్ని పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాం. కోలాటంతో ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుంది. ఇది మాటల్లో వర్ణించలేనిది. కోలాటంతో ఐక్యత భావం కలుగుతుంది. మహిళలు సంప్రదాయ జానపద కళలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి.
– లలిత, కల్లూరు
నాకు కోలాటం అంటే చాలా ఇష్టం. దానిపై ఉన్న మక్కువతో కష్టపడి నేర్చుకున్నా. ఎక్కడ కోలాటం వేయాలన్నా వెళ్లిపోతా. ఈ కళకు సంబంధించిన పాటలు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. యువత సంప్రదాయ కళలకు జీవం పోయాలి.
– రమాదేవి, బాబా బృందావన్ నగర్
●


