టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం(టీబీ డ్యాం)లో 10.066 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2025 డిసెంబర్‌ 27వ తేదీ నుంచి నిలిచిపోయిన ఇన్‌ఫ్లో అకాల వర్షాలతో కొద్ది రోజులు చిన్నపాటి నీటి ప్రవాహం కొనసాగింది. తిరిగి ఈ నెల 19 నుంచి అకాల వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో మళ్లీ మొదలైంది. ఆ రోజు డ్యాంలో 9.709 టీఎంసీలు ఉండగా.. మంగళవారానికి 10.066 టీఎంసీలకు చేరుకుంది. వర్షాలు పెద్ద ఎత్తున కురిస్తే జూన్‌ నెలాఖరు లేదా జూలై నెలలో డ్యాంకు పూర్తిస్థాయిలో నీరు చేరవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా.. మంగళవారం 1588.81 అడుగులతో 10.066 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్‌ఫ్లో 777, ఔట్‌ ఫ్లో 209 క్యూసెక్కులు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement