వ్యక్తిపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై కత్తితో దాడి

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

కోసిగి: మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామానికి చెందిన గుడిసె రాఘవేంద్ర అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన కోసిగి మునేష్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాఘవేంద్ర, మునేష్‌లతో పాటు మరికొందరు కలిసి సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్లారు. ఆట ఆడేటప్పుడు డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో వివాదం రేగింది. కోపోద్రిక్తుడైన మునేష్‌ తన వద్ద ఉన్న కత్తితో రాఘవేంద్ర చేతి భాగం, శరీర వెనుకభాగంలో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని మంగళవారం తెల్లవారుజామున కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యులు ప్రథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రి తరలించారు. దాడి ఘటనపై బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement