ఒకరు దుర్మరణం.. మరొకరికి గాయాలు
పాణ్యం: మండల పరిధిలోని సుగాలిమెట్ట సమీపంలోని కొచ్చెరువు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు పట్టణం దాసరిపాలెంకు చెందిన ప్రభాస్ (20), ప్రణీత్‌కుమార్, ఏసుబాబు, వివేక్‌లు కలిసి సోమవారం రాత్రి 11 గంటలకు పాణ్యంలోని చెంచుకాలనీలో వెలసిన శ్రీ సుంకులాపరమేశ్వరి ఆలయానికి వచ్చారు.
మంగళవారం పూజలు నిర్వహించి నలుగురు రెండు బైక్‌లలో కర్నూల్ వెళ్తుండగా కొచ్చెరువు సమీపంలో ప్రభాస్ ముందు వెళ్తున్న కారును అధిగమించే క్రమంలో అదుపుతప్పి ఎడమవైపు ఉన్న కొండను ఢీకొట్లాడు. ఈ ఘటనలో ప్రభాస్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రణీత్‌కుమార్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు తరలించారు. లారీ డ్రైవర్‌గా పని చేసే ప్రభాష్ మృతి విషయం తెలియగానే తల్లి ఎప్సికా, తండ్రి ఏసురత్నం శోకసంద్రంలో మునిగిపోయారు.


