బొమ్మలసత్రం: గ్రీన్‌కో ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచిన వారిపై దాడులు చేస్తారా? అని వైఎస్సార్‌సీపీ నంద్యా ల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రీన్‌కో ప్రాజెక్ట్‌లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు మంజూరయ్యాయి. వాటిని అధికార టీడీపీ నాయ కులు పంచకపోగా వేధించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించడంతో సోమవారం అధికారపార్టీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడి నంద్యాల జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులను మంగళవారం కాట సాని పరామర్శించి మాట్లాడారు. బాధిత రైతుల కు మంజూరైన పరిహార చెక్కులను మంచాలకట్టకు చెందిన టీడీపీ నేతలు తమ వద్ద ఉంచుకొని వేధించడం సరికాదన్నారు. అధికారపార్టీ గూండాల దాడిలో గాయపడిన తమ పార్టీ శ్రేణులు పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఎస్‌ఐ కేసు నమోదు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు ఎస్‌ఐ వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం ఆయన బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌ను కలిసి విన్నవించారు. కాటసాని వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, రవిరెడ్డి, మేఘనాథరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి


