వైఎస్సార్‌సీపీ హయాంలో వాల్మీకులకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో వాల్మీకులకు పెద్దపీట

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ప్యాపిలి: గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే వాల్మీకుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. గుడిపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన వాల్మీకి విగ్రహానికి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న బుగ్గనకు వాల్మీకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేని వాల్మీకి గుహలను తమ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్ది పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ. 3 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేశామన్నారు. బేతంచెర్ల మండలంలో వాల్మీకి భవన్‌ నిర్మించిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్‌ రెడ్డి, బూత్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా మల్లికార్జునరెడ్డి, వాల్మీకులు నారాయణ స్వామి, మాజీ సర్పంచ్‌ గోవిందు, నరేశ్‌, శంకర్‌, ఓబులేసు, గ్రామ పెద్దలు రామిరెడ్డి, చిన్నపుల్లారెడ్డి, వెంకటరామిరెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, నారాయణ స్వామి, వైఎస్సార్‌సీపీ నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, రజనీ రెడ్డి, కొండయ్య, నాగరాజు, రంగస్వామి, వెంకటేశ్‌, ప్రేమసాగర్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పాలవెంకటేశ్‌, చెన్నకేశవ యాదవ్‌, ఇంద్రసేనారెడ్డి, పరమేశ్‌ రెడ్డి, నాగేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement