ప్యాకెట్ పాలు తాగితే క్యాన్సర్ బారిన పడతామంటారు. బయట
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లా జనాభాకు అనుగుణంగా రోజుకు 16 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే ఉత్పత్తి అవుతున్న పాలు 10 లక్షల లీటర్లు మాత్రమే. ఈ అంకెలను చూస్తే వివిధ రూపాల్లో కల్తీ చేయడం ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా పాలు సరఫరా అవుతున్నట్లు స్పష్టమవుతోంది. పాలు ఉత్పత్తి చేసే నిజమైన రైతుకు లీటరు మీద పొందుతున్న లాభం రెండు, మూడు రూపాయలైతే.. వాటిని కొంటున్న వ్యాపారులు కల్తీ చేయడం ద్వారా లీటరుకు రూ.10పైగా లాభం పొందుతుండటం గమనార్హం. గత ఏడాది జనవరి నెలలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో అనంతపురం జిల్లాలో పాల కల్తీ గుట్టు రట్టయింది. పాలల్లో మాల్తో టెస్టిన్ పౌడర్, పామాయిల్ 250/500 ఎంఎల్, లీటరు పలుచని పాలు, ఉప్పు తీసుకొని మిక్సీకి వేస్తారు. ఇలా చేయడం వల్ల చిక్కటి లిక్విడ్ వస్తుంది. దీనిని ప్రతి 20 లీటర్ల పాలకు అర్ధలీటరు లిక్విడ్‌ను కలిపి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న విషయం వెలుగు చూసింది. ఇలా కల్తీ చేయడం వల్ల పాలు చిక్కగా ఉంటాయి. వెన్న శాతం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొంత మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలుకావడం కలకలం రేపుతోంది.
రెండేళ్లలో ఏడు కేసులు
2024–25లో కర్నూలులోని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్/డిసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లా మొత్తంగా పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి 15 శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఇందులో 4 శాంపిల్స్‌లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2025–26లో 15 శాంపిల్స్ తీయగా మూడింట్లో ఉన్నట్లు తేలింది. ఇవన్నీ మార్కెట్‌లోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితిని చూస్తే కల్తీ పాలతో ప్రజారోగ్యం ఏస్థాయిలో దెబ్బతింటుందో అర్థమవుతోంది. అధికారుల ఉదాసీన వైఖరి ప్రజల ప్రాణాల మీదకొస్తోంది.
ఉత్పత్తి అవుతున్న పాలు 10 లక్షల లీటర్లే..
ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకారం ప్రతి రోజు చిన్నారులు 500 ఎంఎల్, ఇతరులు 300 ఎంఎల్ పాలు, పాల పదార్ధాలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా జనాభా నేడు 50 లక్షల పైనే. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం మొత్తం జనాభాకు దాదాపు 16 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 10 లక్షల లీటర్లు మాత్రమే. ఉమ్మడి జిల్లాలో 2,16,590 పశువుల నుంచి రోజూ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆవులు, బర్రెలు రోజుకు సగటున 4–5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఈ ప్రకారం రోజుకు 10 లక్షల లీటర్లు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల పాలు తక్కువ పడుతున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు డెయిరీలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఉన్న పాలనే కల్తీ చేస్తున్నట్లు సమాచారం.
ఆందోళన కలిగిస్తున్న పాల నాణ్యత
కలకలం రేపిన
రాజమహేంద్రవరం ఘటన
కల్తీ పాలతో పలువురు మృత్యువాత
ఉమ్మడి జిల్లాకు 16 లక్షల లీటర్ల
పాలు అవసరం
అందుబాటులో ఉన్నది
కేవలం 10 లక్షల లీటర్లే..
అధికారుల తనిఖీలు నామమాత్రం
ప్యాకెట్ పాలు తాగితే క్యాన్సర్ బారిన పడతామంటారు. బయట


