డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
సుశిక్షితులైన డ్రైవర్లు లభిస్తారు
డోన్: రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఐడీటీఆర్) కేంద్ర భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఏటా వేయి మంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా రు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సురక్షితులు, నైపుణ్యంతో కూడిన డ్రైవర్లు అవసరమని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇప్పటివరకు 11వ ఐడీటీఆర్‌ల ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పొదిలి తర్వాత నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామ సమీపంలో 44వ జాతీయ ర హదారి పక్కన రెండో ఐడీటీఆర్‌ను మంజూరు చేశారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.18.50 కోట్ల వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాకారంతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఐడీటీఆర్ ఏర్పాటుకు ఎనలేని కృషిచేశారు.
బిల్లులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం
డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు భారీ వాహనాల మరమ్మతులు చేయడంలో కూడా తర్ఫీదు ఇచ్చేందుకు ఐడీటీఆర్‌లో అన్నిరకాల అవకాశాలు ఉన్నాయి. డోన్ నియోజకవర్గ నిరుద్యోగులకు ఐడీటీఆర్ ఏర్పాటు గొప్పవరం లాంటిది. ఇక్కడి వారే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వారు కూడా డ్రైవింగ్‌లో నైపుణ్యత సాధించి భారీ వేతనాలతో ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు చెల్లించని కారణంగా ఐడీటీఆర్ భవనాల నిర్మాణం నిలిచిపోయింది.
అటకెక్కిన ఐడీటీఆర్ నిర్మాణ పనులు
రెండేళ్లుగా బిల్లులు చెల్లించని
చంద్రబాబు ప్రభుత్వం
ఉపాధి కోల్పోతున్న యువత
ఐడీటీఆర్ భవన నిర్మాణ పనులు పూర్తయితే సుశిక్షితులైన డ్రైవర్లు అందుబాటులోకి వస్తారు. తద్వారా జాతీయ రహదారులపై భారీ వాహనాల ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతాయి. వేలాది మంది నిరుద్యోగులకు ఏటా ఉపాధి లభిస్తుంది.
– క్రాంతికుమార్, ఎంవీఐ, డోన్.
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!


