అపూర్వ వేడుకకు ముస్తాబు
వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాల అపూర్వ వేడుకకు ముస్తాబవుతోంది. పాఠశాల ప్రారంభమైన 1958 మొదటి బ్యాచ్ మొదలుకొని ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి 8న పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం పాఠశాలకు రంగులు వేయిస్తున్నారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రతి ఒక్కరిని రప్పించేందుకు ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. కమిటీలుగా ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులతో పాటు గురువుల నంబర్లు సేకరించి వ్యక్తిగతంగా వేడుకకు ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పండుగ వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. – కొలిమిగుండ్ల


