పరిశ్రమల అభివృద్ధికి నైపుణ్యాలు అవసరం
శ్రీశైలంప్రాజెక్ట్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే నైపుణ్యాలు అవసరమని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ జి.నరేష్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని కృష్ణవేణి రెడ్ల కల్యాణ మండపంలో ‘డిజిటల్ యుగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ సహకారంతో చేపట్టిన సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, మేధావులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాల మద్దతు, కొత్త ఆలోచనలు అత్యంత అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను ఉపయోగించుకొని ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉండాలని పలువురు వక్తలు అన్నా రు. వివిధ రకాల చిన్న తరహా పరిశ్రమల ఏర్పా టు, స్థానిక వనరులతో ఉత్పత్తి, పోటీ ప్రపంచంలో మార్కెటింగ్ వంటి అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సదస్సులో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హుస్సేన్‌బాషా, సదస్సు కన్వీనర్ డా.ఎం.బుచ్చయ్య, అధ్యాపకులు, విద్యార్ధులు, అఖిలభారత రెడ్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు జి.తాతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యజ్ఞ జ్యువెలర్స్ ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక పార్కు రోడ్డులో గురువారం యజ్ఞ జ్యువెలర్స్ ప్రారంభమైంది. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు మెచ్చే విధంగా అధునిక డిజైన్లలో జ్యువెలర్స్ ఉన్నాయన్నారు. సంస్థ యజమాని దుగ్గినేని మల్లికార్జున రావు మాట్లాడుతూ.. తమ షోరూం ప్రారంభం సందర్భంగా నగర ప్రజల కోసం ఐదు రోజుల పాటు బంగారు ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ చార్జెస్, ఫ్లాట్ 50 శాతం వేస్టేజ్ ఆఫర్ ప్రకటించామన్నారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు మానికొండ సిరిచందన, మానికొండ భాను ప్రకాష్ పాల్గొన్నారు.
కర్నూలులో పట్టపగలే చోరీ
● 14 తులాల బంగారు అపహరణ
కర్నూలు (టౌన్): పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే లోపే ఓ ఇంట్లో చోరీ జరిగింది. 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని విజయలక్ష్మీనగర్‌లో నివసించే మద్దిలేటి ప్రైవేట్ ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తూ గురువారం విధులకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య లక్ష్మీదేవి కూతురుతో కలిసి ఇంటికి తాళం వేసి సమీపంలోని బ్యాంకు వద్దకు పని నిమిత్తం వెళ్లింది. తిరిగి వచ్చిన వారి ఇంటికి తాళం లేకపోవడం, లోపల గడియ పెట్టుకోవడంతో అనుమానం వచ్చి కేకలు వేశారు. ఇంట్లో ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బయటికి వచ్చి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆమె పట్టుకునే ప్రయత్నంలో పెనుగులాట జరిగింది. ఆమెను తొసేసిన ఇద్దరు దొంగలు అక్కడే పార్కు చేసిన వారి బైక్‌లో పరారయ్యారు. లోపలికి వెళ్లి బీరువాను పరిశీలిస్తే 14 తులాల బంగారు నగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరిశ్రమల అభివృద్ధికి నైపుణ్యాలు అవసరం


