రెండు బైక్‌లు ఢీ.. నలుగురికి గాయాలు
బనగానపల్లె రూరల్: మండలంలోని చిన్నరాజుపాళెం గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నరాజుపాళెం తండాకు చెందిన మౌలాలీస్వామి నాయక్, బాలస్వామి నాయక్ ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు బయలుదేరారు. అదే సమయంలో బనగానపల్లెకు చెందిన శివనందం, మనె మ్మ ద్విచక్ర వాహనంపై జలదుర్గం వైపు వెళ్తుండగా.. చిన్నరాజుపాళెం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలపై ఉన్న నలుగురు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనం, ఆటోల సాయంతో వారిని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన శివనందం, మనెమ్మ
ప్రమాదంలో ఢీకొట్టుకున్న బైక్‌లు
రెండు బైక్‌లు ఢీ.. నలుగురికి గాయాలు


