లోక కల్యాణార్థం
పేరుసోములలోని విష్ణుకంటి క్షేత్రం పీఠాధిపతి రామ్మోహన్‌స్వామి లోక కల్యాణార్థం చేపట్టిన పాదయాత్రకు భక్తులు నీరాజనం పలుకుతున్నారు. అవుకు మండలంలోని ఎర్రమల కొండల్లో వెలసిన శ్రీలక్ష్మి కంబగిరిస్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. గురువారం ఉదయం క్షేత్రం నుంచి బయలుదేరిన స్వామి గాలేరి నగరి వరద కాల్వ వెంట కొలిమిగుండ్ల మండలంలోని బెలుం శింగవరంకు చేరుకోగానే భక్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడే వీరపాపులమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. దారి వెంట భక్తులు కీర్తనలు ఆలపిస్తు ముందుకు సాగారు. కొండపై ఉన్న టెక్కె స్వామి దర్గా వద్దకు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. పదేళ్ల నుంచి ప్రతి ఏటా మాఘమాసంలో పాదయాత్ర చేపడుతున్నట్లు స్వామి పేర్కొన్నారు. సృష్టిలో ప్రతి జీవి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు 800 మందికి పైగానే భక్తులు స్వామి వెంట అడుగులు వేస్తున్నారు.
– కొలిమిగుండ్ల


