కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
కర్నూలు(సెంట్రల్): కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం ఉదయం ఆమె కార్యాలయానికి చేరుకుని సేల్ డీడ్‌ల స్వీ కరణ, డాక్యుమెంట్ల నమోదు, రిజిస్ట్రేషన్ ప్రక్రి య, ఫైళ్ల భద్రత, కంప్యూటరైజ్డ్ ఎంట్రీలు, ప్ర జలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ రిజిస్ట్రేషన్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. డాక్యుమెంట్లలో వివరాలను సరిగా నమోదు చేయాల న్నారు. అనంతరం వినియోగదారులతో మాట్లాడి స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ సమస్యలపై ఆరా తీశారు. ఆమె వెంట కర్నూలు ఇన్‌చార్జి డీఆర్ భార్గవ్, కర్నూలు ఇన్‌చార్జి సబ్ రిజిస్టార్ వరప్రసాద్ ఉన్నారు.
ఒకేషనల్ ప్రాక్టికల్
పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 21 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,313 మందిలో 1,236 మంది హాజరయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు 18 కేంద్రాలుగా ఏర్పాటు చేయగా 1,081 మందిలో 1,062 మంది పరీక్షలకు హాజరయ్యారు. నగరంలోని పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు తనిఖీ చేశారు.
రగ్బీ జాతీయ క్రీడల కోచ్‌గా తొగర్చేడు పీఈటీ
కృష్ణగిరి: మండల పరిధిలోని తొగర్చేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాసులు రగ్బీ జాతీ య క్రీడల కోచ్‌గా ఎంపికై న ట్లు పాఠశాల విద్యా కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రాజేష్ మంగళవారం తెలిపారు. 69వ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ 2025–26 క్రీడలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్నారన్నారు. అండర్–19 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో శ్రీనివాసులు కోచ్‌గా వ్యవహరిస్తారన్నారు. క్రీడలు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఢిల్లీలోని త్యాగరా య స్టేడియంలో జరుగనున్నట్లు పేర్కొన్నారు.
ఏఆర్ ఏఎస్పీకి సత్కారం
కర్నూలు: జిల్లా పోలీసు శాఖ ఆర్మ్‌డ్ రిజర్వు వి భాగం అదనపు ఎస్పీ సింగాల కృష్ణమోహన్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం దక్కింది. విధి నిర్వహణ లో అంకితభావంతో పనిచేసినందుకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభు త్వం ఆయనకు విశిష్ట సేవా పథకాన్ని ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కృష్ణమోహన్‌ను ఏఆర్ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు నారాయణ, జావేద్, పోతుల రాజు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ


