ఎస్సార్‌బీసీలో నిలిచిన నీటి ప్రవాహం
బనగానపల్లె: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు నీటి విడుదల నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎస్సార్బీసీ పరిధిలోని పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, అవు కు, కోవెలకుంట్ల, సంజామల మండలాల పరిధిలోని 13 బ్లాక్‌ల ద్వారా 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, నువ్వులు, మినుము మరి న్ని వాణిజ్య పంటలను కూడా సాగు చేశారు. అయితే అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నీటి సరఫరాను నిలిపివేయడంతో పంటల సాగుపై ఆందో ళన చెందుతున్నారు. సాగునీటి నిలుపుదల చేస్తే తమ పరిస్థితి ఏమటని ప్రశ్నిస్తున్నారు.


