వేరుశనగకు రికార్డుస్థాయి ధర
క్వింటా రూ.12,096
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వేరుశనగకు క్వింటా రూ.12,096 ధర పలికింది. ఈ మేరకు 2,614 సంచుల వేరుశనగకాయలు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.12,096, మధ్య ధర రూ.10,666, కనిష్ట ధర రూ.5,599 నమోదైంది.
పత్తి ధర రూ.8,519
అలాగే 2,762 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.8,519, మధ్య ధర రూ.8,011, కనిష్ట ధర రూ.4361 పలికింది.


