వైభవంగా మధ్వనవమి వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మధ్వ నవమి వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు నేతృత్వంలో మంగళవారం వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేడుకల్లో భాగంగా శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, ఆంజనేయస్వామికి విశేష పంచామృతాభిషేకం గావించారు. అనంతరం స్వర్ణ రథంపై మధ్వమత ఆది గురువు చిత్ర పటాన్ని శ్రీ మఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగించారు. ఎంతో పవిత్రంగా సాగిన మధ్వ నవమి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


