రాలిన చీని రైతుల ఆశలు
కాంకర, మంగు తెగుళ్లతో
మార్కెట్‌లో లభించని గిట్టుబాటు ధర
కృష్ణగిరి: చీని తోటలను తెగుళ్లు చుట్టుముట్టడంతో రైతుల ఆశలు రాలిపోతున్నాయి. దిగుబడి బాగా వస్తుందని ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు చేసినా ఫలి తం లేకుండా పోయింది. చెట్టు నుంచి కాయలు చేతి వచ్చే సరికి తెగుళ్లు అధికమయ్యాయి. లక్షల రూపాయల పెట్టుబడులు మట్టిలో కలిసిపోతున్నాయి. పెనుమాడ, చుంచు ఎర్రగుడి తదితర గ్రామాల్లోని తోటలకు కాంకర తెగులు సోకింది. చీని కాయలు పసుపురంగులోకి మారి చెట్టు నుంచి రాలిపోతున్నాయి. అలాగే మంచు ప్రభావంతో మంగు తెగులు సోకింది. కాయలన్నీ నల్లగా మారడంతో రైతులు దిక్కుతోచని స్థితి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. తెగుళ్లు సోకడంతో 5 నుంచి 7 క్వింటాళ్లు వచ్చేది కష్టమేనని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉంటే క్వింటా చీని కాయలను రూ. 20వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేసేవా రు. గతేడాది ఇదే ధరతో కాయలను విక్రయించామని, ఈ ఏడాది క్వింటా రూ. 12వేలు నుంచి రూ.15 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఉద్యానశాఖ అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
తగ్గిన దిగుబడి
రాలిన చీని రైతుల ఆశలు


