ఉత్తమ సేవలకు అవార్డు
గడివేముల: గ్రామ పాలనలో మెరుగైన సేవలు అందించిన కొరటమద్ది సర్పంచ్‌కు ఉత్తమ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఎంపిక కాగా.. నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరట మద్ది ఒకటి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పారిశుద్ధ్యం, ఇంటి, నీటి పన్నుల వసూళ్లు, వర్మి కంపోస్టు తయారీ, విక్రయాలు, గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుల నిర్వహణ, తదితర అన్ని రకాల అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రి చేతుల మీదుగా సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎడమకంటి నాగేశ్వరరెడ్డి, దంపతులు అవార్డు అందుకున్నారు.


