మాన్యం భూమిలో మైనింగ్ అక్రమాల పరిశీలన
బనగానపల్లె రూరల్ : పలుకూరు గ్రామంలోని శ్రీ రామేశ్వరస్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 308లో ఉన్న మాన్యం భూమిలో కొన్ని నెలల నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది. జిల్లా దేవదాయశాఖ అఽధికారి ఎస్ మోహన్, ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు అక్కడి నుంచి పారిపోయారు. అఽధికారులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నదెవరు.. ఎంత మేర నాపరాయి వెలికితీశారు తదితర వివరాలను పరిశీలించారు. చర్యల నిమిత్తం నివేదిక ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు దేవదాయశాఖ అధికారి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఈఓ బ్రహ్మనందరెడ్డి, ఆలయ అర్చకులు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యంతో చదవాలి
వెల్దుర్తి: విద్యార్థినులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని చదవాలని డీసీఓ డాక్టర్ ఐ శ్రీదేవి, జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ శాంతకుమారి సూచించారు. స్థానిక పీఎంశ్రీ డా బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకల పాఠశాల/కళాశాల (పీఎంశ్రీ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్/జేసీ) వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ప్రిన్స్‌పాల్ లక్ష్మీ ప్రసూన ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. పది, ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రణాళికతో చదవి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. ఉత్తమ ప్రతిభతో ఇటు గురుకులానికి, అటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంఈఓ ఇందిర, డిప్యూటీ ఎంపీడీఓ రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు.
స్నేహితుడి మరణం తట్టుకోలేక..
కౌతాళం: స్నేహితుడి మరణం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల పరిధిలోని కుంటనహాల్ గ్రామంలోఈ సంఘటన చోటుచేసుకుంది. కౌతాళం సీఐ అశోక్‌కుమా ర్ తెలిపిన వివరాల మేరకు.. కుంటనహాల్ గ్రా మానికి చెందిన బింగి తిమ్మప్ప(24),మాని స్నేహితులు. పొలం పనులు చేసుకుంటూ జీవించేవారు. అయితే, వారం రోజుల క్రితం మూగజీవాలు తెచ్చుకునేందుకు వెళ్లిన మాని కర్ణాటక రాష్ట్రం సిందనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తోటి స్నేహితుడి మృతిని తట్టుకోలేని తిమ్మప్ప ప్రతి రోజు గుర్తు చేసుకుంటూ మదన పడేవాడు.ఈ క్రమంలో సోమ వారం పశువులకు మేత తెస్తానని పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రి తరలించినట్లు సీఐ తెలిపారు.
గల్లంతైన యువకుడు
శవమై తేలాడు
నంద్యాల(అర్బన్):కేసీ కెనాల్‌లో గల్లంతైన యు వకుడు మంగళవారం శవమై తేలాడు. పట్టణ ంలోని విశ్వనగర్‌కు చెందిన శ్రీనివాసులు అలి యాస్ శ్రీకాంత్ ఆదివారం స్నేహితులతో కలిసి కెనాల్‌లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. రెండురోజులుగా స్నేహితులు, తల్లిదండ్రులు, పోలీసులు గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే, నీటిలో పడిపోయిన వంద అడుగుల దూరంలోనే మంగళవారం ఉదయం శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసులు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు
ఆదోని అర్బన్: గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహానికి టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. సోమవారం స్థానిక పాత బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం పడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే టూటౌన్ పోలీసులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక రోజు గడిచినా బంధువుల ఆచూకీ తెలియకపోవడంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆదేశాలతో గుడ్ మార్నింగ్ సంఘం, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి స్థానిక శ్మశాన వాటిలో ఖననం చేశారు.
మాన్యం భూమిలో మైనింగ్ అక్రమాల పరిశీలన
మాన్యం భూమిలో మైనింగ్ అక్రమాల పరిశీలన


