డీఎల్‌డీఓగా ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

డీఎల్‌డీఓగా ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి

Aug 30 2025 7:44 AM | Updated on Aug 30 2025 7:44 AM

డీఎల్‌డీఓగా ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి

డీఎల్‌డీఓగా ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి

కర్నూలు (అర్బన్‌): జిల్లాలో ఇద్దరు ఎంపీడీఓలకు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ ఆమోదం తెలిపిందని జిల్లాపరిషత్‌ సీఈఓ జి.నాసర రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గూడూరు ఎంపీడీఓగా పనిచేస్తూ ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌ సీసీగా విధులు నిర్వహిస్తున్న అశ్విని కుమార్‌, కల్లూరు ఎంపీడీఓ నాగశేషాచల రెడ్డికి డీఎల్‌డీఓలుగా పదోన్నతి లభించనున్నట్లు చెప్పారు. డీపీసీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో వీరికి పోస్టింగులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ రమాదేవికి..

కర్నూలు(హాస్పిటల్‌): ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) ఏటీవీ. రమాదేవికి పదోన్నతి లభించింది. ఆమెకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ డిపార్ట్‌మెంట్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతో పాటు రాష్ట్రంలో ఐదుగురికి డీడీలుగా పదోన్నతి కల్పించేందుకు కమిటీ అంగీకారం తెలిపింది. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి త్వరలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

సహకార శాఖలో 27 మందికి..

కర్నూలు(అగ్రికల్చర్‌): సహకార శాఖలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 27 మందికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సహకార శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురికి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నుంచి డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అయిన శివరామకృష్ణను ఆత్మకూరు నుంచి నంద్యాల సహకార ఆడిట్‌ అధికారిగా, రుక్సానా బేగంను కర్నూలు డీసీఓ ఆఫీస్‌ నుంచి నంద్యాల డీఎల్‌సీఓగా, డీసీఏఓ ఆఫీస్‌లో పనిచేస్తున్న చెన్నమ్మను అక్కడే జిల్లా సహకార ఆడిట్‌ అధికారిగా పదోన్నతిపై నియమించారు. కాగా సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా 8 మందికి, 8 మందికి జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు లభించాయి.

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈగా సీహెచ్‌ మనోహర్‌

కర్నూలు ఈఈగా అబ్దుల్‌ ఖాదర్‌, నంద్యాలకు ఈ.శ్రీనివాసులు

కర్నూలు(అర్బన్‌): జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం పర్యవేక్షక ఇంజనీరుగా సీహెచ్‌ మనోహర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో ఇన్‌చార్జి ఎస్‌ఈలుగా కొనసాగుతున్న ఈఈలకు ఎస్‌ఈలుగా పదోన్నతి కల్పించేందుకు 2024–25 ప్యానెల్‌ ఇయర్‌ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌ మనోహర్‌కు ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి కర్నూలు జిల్లాకు పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకు ఇక్కడ ఇన్‌చార్జి ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తూ రెగ్యులర్‌ ఎస్‌ఈగా పదోన్నతి పొందిన బి.నాగేశ్వరరావుకు శ్రీకాకుళం జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదిలాఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించారు. అందులో భాగంగానే కడప జిల్లా బద్వేల్‌ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న డి.అబ్దుల్‌ ఖాదర్‌ను కర్నూలు ఈఈగా, చిత్తూరు డీఈఈగా పనిచేస్తున్న ఈ.శ్రీనివాసులును నంద్యాల ఈఈగా నియమించారు. ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌–1 డీఈఈ ఎం.మురళీధర్‌ను సత్యసాయి జిల్లా పెనుగొండ ఈఈగా, కోడుమూరు డీఈఈ జి.శ్రీనివాసులును అనంతపురం ఈఈగా పదోన్నతిపై నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement