
పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
శ్రీలక్ష్మీ శ్రీనివాస బీఈడీ కాలేజీలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. అదే విధంగా పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ అబ్రహం, వయోజన విద్య అడిషనల్ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి సైతం తనిఖీ చేశారు. తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని అధికారుల దృష్టికి కొందరు తీసుకెళ్లారు. ఇలాంటి సమస్యలపై గ్రీవెన్స్ తీసుకోవాలని డీఈఓ శామ్యూల్ పాల్‌కు జిల్లా కలెక్టర్ సూచించారు. ఇదిలా ఉండగా దివ్యాంగుల కోటాలోని పోస్టుల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.
సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్న అధికారులకు సూచనలు చేస్తున్న
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా