ఆలూరు రూరల్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆలూరు విద్యుత్ అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ నాగేంద్ర ప్రసాద్‌పై వేటు పడింది. శనివారం ఆయన్ను ఉన్నతాఽధికారులు సస్పెండ్ చేశారు. హాలహర్వి మండలం కొక్కరచేడ, శ్రీధర్‌హాల్, బేవినహాల్, చాకిబండ గ్రామాల్లో ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా పునరుద్ధరించలేదు. హొళగుంద మండలంలో కొన్ని రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు, విద్యుత్ స్తంభాల లేన్లు ఏర్పాటు చేశారు. దీనిపై గత నెలలో ఎస్‌ఈ ఉమాపతి హొళగుందకు వెళ్లి విచారణ చేశారు. అలాగే గతంలో ఇతనిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో నాగేంద్రప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. హాలహర్వి మండలంలోని పాత విద్యుత్ మీటర్లు స్టోర్‌కు పంపించకుండా ఆలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణంలోని హాలహర్వి పాత సెక్షన్ ఆఫీసులో ఉంచడంపై ‘సాక్షి’ గతంలో వెలుగులోకి తీసుకు వచ్చింది.
డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి డిప్లమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ బీఎస్సీ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ప్లాస్టిక్స్ తీరా స్పెస్పింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో(https://ci pet24onlineregistrationform.org/cipet/లింక్) ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులకు ఏపీ ప్రభుత్వం నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉందన్నారు. జూన్ 9న నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలోని 150 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 6300147965 నంబర్‌ను సంప్రదించాలన్నారు.