యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామి వార్ల దేవస్థానం జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శివాలయం. పరశురాముడు ఇక్కడి స్వామి వారి లింగస్వరూపాన్ని ప్రతిష్ట చేశారని ప్రతీతి. పూర్వం వెయ్యి మంది మునులు ఇక్కడ తపస్సు చేశారని, అందువల్ల దీనిని వెయ్యి మునుల కుదురుగా.. కాలక్రమంలో యనమలకుదురుగా రూపాంతరం చెందిందని చెబుతారు. కొద్ది సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మాణం చేసిన ఆలయ ప్రాంగణం మరింత కనువిందు చేస్తోంది. అలాగే ఇక్కడ ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంటుంది. కార్తికమసంలో స్వామివారికి పలు విశేషమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు.


