గ్రాండ్‌ ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ ప్రణాళిక

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

మచిలీపట్నాన్ని మేటి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

వీటిపై ఫోకస్‌..

అండగా ఉంటాం

స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం..

నగరంలోని దీర్ఘకాలిక సమస్యలపై అవగాహన ఉంది

కూటమి విధ్వంస పాలనతో అభివృద్ధి శూన్యం

ప్రజాపాలన తెచ్చి ప్రగతి పయనం ప్రారంభిద్దాం

‘సాక్షి’తో వైఎస్సార్‌ సీపీ నగరపాలక సంస్థ మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి

బ్రాండ్‌ బందరు కోసం..
మచిలీపట్నాన్ని మేటి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మచిలీపట్నంటౌన్‌: ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మచిలీపట్నం నగరం రానున్న రోజుల్లో సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి వెల్లడించారు. ప్రజలను వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు బందరును ఒక బ్రాండ్‌ నగరంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. నగరంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జ్యోతి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

పోటీ ఎందుకంటే..

కూటమి ప్రస్తుతం విధ్వంస పాలన చేస్తోంది. పేదలు తినడానికి సైతం అవస్థలు పడుతున్నారు. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఇటువంటి సమయంలో ప్రజలకు భరోసా కావాలి. ఆ భరోసా వైఎస్సార్‌ సీపీ మాత్రమే ఇవ్వగలదు. ప్రస్తుతం బియ్యం, ఉల్లి పాయలు, కందిపప్పు, పంచదార, మంచినూనె, తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ ధరలను నియంత్రించేందుకు కూటమి పాలకులు కనీసం ప్రయత్నం కూడా చేయటం లేదు. ఆ పేదవాడి కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను నిలబడుతున్నాను. మా నాన్న పిన్నింటి సూర్యనారాయణ. నగరంలోని మేదర బజార్లో వెండిని కరిగించే పని చేస్తారు. అమ్మ అన్నపూర్ణ గృహిణి. మా అమ్మ వాళ్లకు మేం నలుగురు సంతానం. ముగ్గురు ఆడవాళ్లలో నేను రెండో దాన్ని. అక్క, చెల్లికి వివాహం కాగా, అన్నయ్య శ్రీనివాసరావు కూడా వెండి కరిగించే పని చేస్తారు. ఇక నా భర్త లంకా సూరిబాబు కూడా రైతు కాబట్టి జనాల కష్టాలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తా.

నగర ప్రజలకు రానున్న రోజుల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కృషి చేస్తా. ప్రస్తుత కూటమి పాలనలో తరకటూరులోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌తో పాటు నగరంలోని పుట్లమ్మ చెరువులను పూర్తిగా నింపలేదు. ఫలితంగా అడుగంటిన నీటినే సరఫరా చేస్తుండడంతో ప్రజలకు మురికి నీళ్లు అందుతున్నాయి. తమ పాలకవర్గానికి ప్రజలు అధికారమిస్తే చెరువులను పూర్తిస్థాయిలో నింపడంతో పాటు నీటి శుద్ధిలో ప్రత్యేక శ్రద్ధ చూపి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కృషి చేస్తా.

అభివృద్ధి ప్రణాళిక ఇది..

నగరాన్ని రానున్న రోజుల్లో సుందరీకరించి స్థానికులతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తా. అధ్వానంగా ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతా. నియోజవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయి. వీటిని కొనసాగించేందుకు కృషి చేస్తా.

కూటమి పాలకులు నగరంలో గత రెండున్నరేళ్లుగా విధ్వంసపాలనని కొనసాగిస్తున్నారు. మూడు స్తంభాల సెంటర్‌ సమీపంలోని కుమ్మరిగూడెంలో నిరుపేదలు నిర్మించుకున్న 200 గృహాలను నిర్ధాక్షిణ్యంగా పోలీసు పహారా నడుమ ధ్వంసం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో, రహదారుల వెంబడి ఉన్న వడ్డీ కొట్లను, దుకాణాలను తొలగించారు. వేలాది మంది నగరవాసులు ఉపాధి కోల్పోయి వేరే ప్రాంతాలకు తరలిపోయేలా కూటమి పాలకులు కక్షగట్టారు. అటువంటి వారికి అండగా నిలబడతాం.

నాపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపిస్తే సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. ముఖ్యంగా నగరంలో డ్రెయిన్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లో ముంపు సమస్య ఎదురవుతోంది. డ్రెయిన్లలో మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా చూడాల్సి ఉంది. శివారు ప్రాంతాలకు సైతం తాగునీరు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటా. అలాగే నగరంలో చెత్తను తరలించే 48 వాహనాలను కూటమి పాలకులు పక్కన పెట్టేశారు. ఫలితంగా నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. చెత్తను తరలించేందుకు పూర్తి సామర్థ్యం మేరకు వాహనాలు లేకపోవడంతో చెత్త కుప్పలను తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. అలాగే నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న కుక్కల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement