గుడివాడ టౌన్: విద్యార్థులు విద్యతో పాటు దేశ భక్తిపై కూడా శ్రద్ధ చూపాలని 16 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ చందన్ ఠాకూర్ సూచించారు. కాలేజీ ప్రాంగణంలో ఎన్‌సీసీ ఎంపికలు శనివారం జరిగాయి. 26 మంది బాలురు, 13 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ చందన్ ఠాకూర్ మాట్లాడుతూ.. విద్యతో పాటు నేషన్ బిల్డింగ్, క్రమ శిక్షణ, జాతీయ ఇంటిగ్రేషన్ పెంపొందించాలన్నారు. మూడేళ్లపాటు వివిధ అంశాలపై వీరికి శిక్షణ ఇస్తామని, ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.జె.ఎస్.కుమార్, పాలక మండలి ప్రసిడెంట్ ఎల్.ఆర్.కె.ప్రసాదు, ఎన్‌సీసీ అధికారి మహ్మద్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు.


