‘మౌలిక’ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

‘మౌలిక’ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శనివారం జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ నమ్రతా అగర్వాల్‌తో కలిసి మౌలిక వసతుల ప్రాజెక్టులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ స్పష్టమైన విధానాలు, కాలపరిమితితో ప్రక్రియలను రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణాలను గుర్తించి వాటి పరిష్కారానికి శాఖల వారీగా సమగ్ర సిఫార్సులు రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల అమలులో ప్రధానంగా భూసేకరణ, అటవీ, వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు, యుటిలిటీ షిఫ్టింగ్‌, రాష్ట్రస్థాయి పరిపాలన అనుమతులు వంటి కీలక అంశాలపై ఆయన చర్చించారు. అనంతరం భూసేకరణలో పరిహార నిర్ణయం, చెల్లింపు, భూమి స్వాధీనం, మ్యుటేషన్‌ తదితర ప్రక్రియల్లో అనవసర జాప్యాన్ని నివారించాలన్నారు. ఎల్‌ఏఆర్‌ఆర్‌ చట్టం – 2013, జాతీయ రహదారుల చట్టం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, పరిహారం నిర్ణయం విధానాలపై స్పష్టత తీసుకురావాలన్నారు. చట్టపరమైన అంశాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్తులో వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా ఒకే విధానం ఉండేలా సిఫార్సులు రూపొందించాలన్నారు. సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, జిల్లా అటవీశాఖ అధికారి సునీత, బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం శ్రీను, మెయిల్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement