సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో.. | - | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో..

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో.. జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకోండి

మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర బీసీ వెల్పేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఉదయం గుడికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలు పోసిమొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. సూపరింటెండెంట్‌ అచ్యుత మదుసూదనరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జగ్గయ్యపేట అర్బన్‌: ఎన్టీఆర్‌ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జాబ్‌ మేళాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ నందిగామ గాంధీ సెంటర్‌లోని ఏపీ ఎన్జీవోస్‌ బిల్డింగ్‌లో, 29న ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ డిగ్రీ కళాశాల, 30న జగ్గయ్యపేటలోని ఎస్‌ఏవీ అండ్‌ ఎన్‌వీజేఆర్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం తొమ్మిది గంటలకు జాబ్‌ మేళాలు జరుగుతాయని పేర్కొన్నారు. సుమారు పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని వివరించారు. టెన్త్‌, ఇంట ర్మీడియెట్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు జగ్గయ్యపేట జాబ్‌ మేళాకు 96668 15987, 96765 83213, నందిగామ 89199 51682, 72072 08075, ఇబ్రహీంపట్నం జాబ్‌మేళాకు 95027 757755, 80083 76100 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement